Off The Record: వైసీపీ అధిష్టానం చెప్పినా ఆ ఇద్దరి నేతల మధ్య వైరం ఆగట్లేదా..?

Follow

Off The Record: ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయనుకుంటే… అందులోనూ జమ్మలమడుగుకు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఇది. అయితే… మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా… ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి. అయితే కాస్త అటు ఇటుగా అదే టైంలో…. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక అక్కడి నుంచి రగడ మొదలైందట. మెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ… వైసీపీలో కొనసాగుతున్నా… ఆ సోయి లేకుండా… ప్రత్యర్థుల్లాగా పోట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఒక దశలో రామసుబ్బారెడ్డి వర్గంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు నేరుగా దాడులు చేశారు అప్పట్లో. ఇది ఇలాగే కొనసాగితే… నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తేడా పడుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజీ ప్రయత్నం చేశారు.
Read Also: Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
అయితే… వాళ్ళు సర్ది చెప్పిన రోజు సైలెంట్‌గా ఉంటూ, మరుసటి రోజు నుంచి షరా మామూలే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఈ పరిస్థితుల్లోనే…. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాతి నుంచి రామసుబ్బారెడ్డి దూకుడు పెంచారట. అప్పుడంటే… సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కామ్‌గా ఉన్నాను.. ఇక ఇప్పుడు మనకు అడ్డేముందని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే… నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ ఉండగా… సొంతగా మరో ఆఫీస్ ప్రారంభించారు ఎమ్మెల్సీ. వ్యవహారం మరీ ముదిరిపోవడంతో… మరోసారి రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నియోజకవర్గంలోని మొత్తం ఆరు మండలాలను సగం సగం విభజించి చెరో మూడు మండలాలు అప్పగించి ఎవరి పని వాళ్ళని చేసుకోమన్నారట. అయినా… నో యూజ్. ఎవరి పని వాళ్ళు చేసుకునే సంగతి పక్కనపెడితే…. వివాదం ఇంకా ముదిరిందన్నది లోకల్ టాక్. ఏడాది క్రితం వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని విభజించి సగం మరో నేతకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. అందుకే… రామసుబ్బారెడ్డికి అప్పచెప్పిన జమ్మలమడుగు పట్టణానికి ఈ మధ్య తరచూ వస్తూ… తన కార్యాలయంలో కూర్చుని స్థానిక నేతలతో మీటింగ్స్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట..
అంతేకాకుండా…. రామసుబ్బారెడ్డికి అప్పగించిన మూడు మండలాలను తిరిగి తన పరిధిలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకే… తన పరిధిలోని వాటిని వదిలేసి మిగతా మూడు మండలాల్లో తరచూ తిరుగుతూ… స్థానిక నేతల్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తల్ని ఇరకాటంలో పడేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వెనక నడవాలో అర్ధంకాక తలలు బాదుకుంటోందట కేడర్. వాళ్ళంతా… సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు రామసుబ్బారెడ్డిని విమర్శించడం, అలాగే రామసుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సుధీర్ రెడ్డిని విమర్శించడం అలవాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తుంటే…. ఎక్కువ మంది మాత్రం ఇబ్బందిగా ఫీలవుతున్నారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటున్న క్రమంలో… ఇదెక్కడి పరిస్థితిరా.. దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని మొత్తానికే ముంచేస్తారా అని కార్యకర్తలు కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డికి చెక్ పెట్టడానికే మాజీ ఎమ్మెల్యే రూట్ మార్చారన్నది ఇంకో టాక్. ఎవరు ఎవరికి చెక్ పెట్టుకున్నా… అంతిమంగా అది పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందన్నది జమ్మలమడుగు వైసీపీ కేడర్ బాధ.
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయనుకుంటే… అందులోనూ జమ్మలమడుగుకు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఇది. అయితే… మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా… ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం