OPPO A5 5G | మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో లాంచ్ అయిన ఒప్పో కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ధర చాలా తక్కువ..!

Follow

OPPO A5 5G | మొబైల్స్ తయారీ దారు ఒప్పో భారత్‌లో ఎ5 5జి పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గత నెలలో ఎ5ఎక్స్ 5జిని విడుదల చేసిన తరువాత ఈ ఫోన్‌నే లాంచ్ చేయడం విశేషం. ఎ5 5జి స్మార్ట్ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఎల్‌డీసీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ ఫోన్ తెర స్పష్టంగా కనిపించేలా ఇందులో 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తున్నారు.
మిలిటరీ గ్రేడ్ నాణ్యత..
ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ నాణ్యతను అందిస్తున్నారు. అందువల్ల ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఈ ఫోన్ అంత సులభంగ డ్యామేజ్ అవదని కంపెనీ చెబుతోంది. అలాగే హీట్, మాయిశ్చర్, షాక్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను సైతం ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫీచర్ లభిస్తున్న ఫోన్లలో ఇదొకటి కావడం విశేషం. ఇక ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. దీనికి 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఫోన్ బాక్స్‌లో 45 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను సైతం అందిస్తున్నారు.
వేగంగా చార్జింగ్..
ఈ ఫోన్‌ను కేవలం 21 నిమిషాల్లోనే 30 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. 37 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫోన్ ను ఎలా వాడినా కూడా 5 ఏళ్ల పాటు బ్యాటరీ మన్నుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ డిస్ ప్లేకు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో ఉన్న ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మెమొరీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సౌకర్యం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఫింగర్ ప్రింగ్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.
ధర వివరాలు..
ఒప్పో ఎ5 5జి స్మార్ట్ ఫోన్ అరోరా గ్రీన్, మిస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.15,499 ధరకు అందిస్తున్నారు. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఇతర ఆన్ లైన్ స్టోర్స్, రిటెయిల్ స్టోర్స్‌లో కూడా త్వరలో విక్రయించనున్నారు.
మొబైల్స్ తయారీ దారు ఒప్పో భారత్‌లో ఎ5 5జి పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గత నెలలో ఎ5ఎక్స్ 5జిని విడుదల చేసిన తరువాత ఈ ఫోన్‌నే లాంచ్ చేయడం విశేషం.