Oppo K13x 5G : 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఒప్పో K13x ఫోన్.. ధర కేవలం రూ. 12వేల లోపే.. ఫుల్ డిటెయిల్స్..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Oppo K13x 5G

Oppo K13x 5G : ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఒప్పో K13x ఫోన్ అధికారికంగా (Oppo K13x 5G) లాంచ్ అయింది. రూ. 12వేల కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది.

ఈ ఒప్పో ఫోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50MP డ్యూయల్ కెమెరా, 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50, ఐక్యూ Z10x, రియల్‌మి P3 వంటి పోటీదారులకు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

భారత్ ధర, లభ్యత :
ఒప్పో K13x మొత్తం 3 వేరియంట్లలో లభ్యమవుతుంది.

రూ. 11,999 – 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్
రూ. 12,999 – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్
రూ. 14,999 – 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్

జూన్ 27 మధ్యాహ్నం నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ అనే 2 పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
ఒప్పో K13x ఫోన్ భారీ 6,000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఒప్పో సింగిల్ ఛార్జ్‌పై ఒకటిన్నర రోజుల పాటు వస్తుంది. గేమర్‌లు, ప్రయాణికులకు బెస్ట్ ఫోన్.

పర్ఫార్మెన్స్ :
మీడియాటెక్ డైమెన్సిటీ 6300+ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఒప్పో K13x మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 5G పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మాలి-G57 MC2 GPU, 8GB LPDDR4x ర్యామ్ వరకు, 256GB వరకు UFS 2.2 స్టోరేజీ, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

Read Also : Oppo Reno 12 Price : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. ఒప్పో రెనో 12పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15పై రన్ అవుతుంది. ఒప్పో 4 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌ అందిస్తుంది.

కెమెరా ఫీచర్లు :
1080p రికార్డింగ్‌తో 50MP డ్యూయల్ సెటప్ కలిగి ఉంది. ఒప్పో K13xలో 50MP OV50D మెయిన్ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి.

60fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 30fps వద్ద 1080p సామర్థ్యంతో 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

డిస్‌ప్లే, మన్నిక :

  • 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • 1,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్
  • పాండా గ్లాస్ ప్రొటెక్షన్
  • IP65 రేటింగ్,
  • MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ రేటింగ్‌

​Oppo K13x 5G : ఒప్పో K13x 5G ఫోన్ 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే , 50MP కెమెరా, డైమెన్సిటీ 6300 చిప్‌ వంటి ఫీచర్లు కలిగి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *