OTT | ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఏంటో తెలుసా?

Follow

OTT | ప్రతి వారం ప్రేక్షకులకి వినోదం పంచేందుకు అటు థియేటర్, ఇటు ఓటీటీలలో వైవిధ్యమైన సినిమాలు రెడీగా ఉంటున్నాయి. ఈ వీకెండ్లో బ్లాక్‌బస్టర్ మూవీలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానుండగా, వాటి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నితిన్, సప్తమి గౌడ జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’ చిత్రం జులై 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. సిద్ధార్థ్ కథానాయకుడిగా శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 బీహెచ్‌కే’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ జురాసిక్ ప్రపంచంలో ఏడో భాగం ‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’ పేరుతో తెరకెక్కింది. జులై 4న ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హెడ్ ఆఫ్ స్టేట్ (మూవీ) జులై 2 నుండి స్ట్రీమ్ కానుండగా, ఉప్పు కప్పురంబు (మూవీ) జులై 4 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్‌సిరీస్: సీజన్2) జులై 3 నుండి స్ట్రీమ్ కానుంది. ది శాండ్‌మ్యాన్ (వెబ్‌సిరీస్:సీజన్2) జులై 3, ది ఓల్డ్ గార్డ్2 (ఇంగ్లీష్ మూవీ) జులై 2 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక జీ5 లో కాళీధర్ లపతా (మూవీ) జులై 4 నుండి స్ట్రీమ్ కానుంది.
సోనీలివ్ లో ది హంట్: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్ కేస్ (మూవీ) జులై 4 నుండి స్ట్రీమ్ కానుండగా, జియో హాట్‌స్టార్ లో క్యాంపైన్ (మూవీ) జూన్ 30 నుండి స్ట్రీమ్ కానుండగా, గుడ్ వైఫ్ (వెబ్‌సిరీస్) జులై 4 నుండి, లా అండ్ ద సిటీ (మూవీ) జులై 5 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక ఈటీవీ విన్ లో చూస్తే.. ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (వెబ్‌సిరీస్) జులై 4నుండి స్ట్రీమ్ కానుంది.సిన్నర్స్ (HBO Max),ఇన్ ద లాస్ట్ ల్యాండ్స్ (Lions gate Play) చిత్రాలు జులై 4 నుండి స్ట్రీమ్ కానున్నాయి. ఈ జాబితాలో మరి కొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది.
OTT | ప్రతి వారం ప్రేక్షకులకి వినోదం పంచేందుకు అటు థియేటర్, ఇటు ఓటీటీలలో వైవిధ్యమైన సినిమాలు రెడీగా ఉంటున్నాయి. ఈ వీకెండ్లో బ్లాక్‌బస్టర్ మూవీలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానుండగా, వాటి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నితిన్, సప్తమి గౌడ జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’ చిత్రం జులై 4న థియేటర్స్‌లో విడుదల కానుంది.