OTT Movie: కళ్లకు కట్టినట్టుగా.. ఒసామా బిన్ లాడెన్‌పై వెబ్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు..ఆ సీన్స్ హైలెట్

Follow

ఇప్పుడు ఓటీటీల్లో రియల్ స్టోరీలకు బాగా ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, కొందరు ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 9/11 ఉగ్ర దాడి ప్రధాన సూత్ర ధారి, కరడు గట్టిన తీవ్ర వాది ఒసామా బిన్ లాడెన్ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అమెరికా దేశ చరిత్రలోనే దారుణ ఘటన ఈ 9/11 ఉగ్రదాడి. న్యూయార్క్ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడిగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి బాధ్యులెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ ను నిఘా సంస్థలు ఎలా మట్టుబెట్టాయన్నది ఎంతో ఉత్కంఠగా, కళ్లకు కట్టినట్టుగా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ మొత్తంలో చాలా సన్ని వేశాలను కొన్ని వాస్తవిక సన్నివేశాలతో తెరకెక్కించడం విశేషం. ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడానికి జరిగిన ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్‌కి బ్రీఫ్ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్‌ను కూడా చాలా చక్కగా ఎడిట్ చేసి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.
‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం మూడు భాగాలున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 9/11 ఉగ్రదాడికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సంచలన విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. కాబట్టి ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ చూడొచ్చు..
Everyone should watch American Manhunt: The Search for Osama bin Laden on @Netflix—not just to remember what the intelligence community missed before 9/11, but to recognize how blind we are today. Our government has less access to, and collection on, al-Qaeda’s core senior… pic.twitter.com/Uyt2vuH73m
— Sarah Adams (@TPASarah) May 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కరుడు గట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. అమెరికాను అస్తవ్యస్తం చేసిన 9/11 ఉగ్రదాడిని ఇందులో ప్రధానంగా చూపించారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.