Packaged Food: మీరు ప్యాకేజింగ్ ఫుడ్ వాడుతున్నారా.. తప్పకుండా ఇవి చెక్ చేయండి.. ఎంత డేంజరో తెలుసా?

Follow

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఇన్స్టంట్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. సమయం లేకనో, చేసుకొనే ఓపిక లేకనో తెలియదు కానీ, ప్యాకేజింగ్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. తెలియకుండానే అనేకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ప్యాకేజింగ్ ఫుడ్ వాడటం, తినడం చాలా ప్రమాదమట. ఎందుకంటే, పదార్థాలు ఎక్కువకాలం పాడవకుండా ఉండటానికి వాటిలో కెమికల్స్ ను వాడుతున్నారు. అలా తెలియకుండానే వాటిని తినడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, ప్యాకేజింగ్ ఫుడ్ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను చెక్ చేసుకోవాలట. మరి ఆ అంశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్స్పైరీ డేట్(గడువు తేదీ): మనం తీసుకుంటున్న ఫుడ్ ఎంత కాలం వరకు సరిగా ఉంటుందని తెలియజేసే తేదీనే గడువు తేదీ అంటారు. ఆ పదార్థాన్ని గడువు తేదీలోపే వాడాలి. ఇది చాలా ప్రధానమైనది. కాబట్టి, ఆ పదార్థం నాణ్యత కలిగినదా కాదా అని ఎల్లప్పుడూ గడువు తేదీని చెక్ చేయాలి.
పోషకాహార సమాచారం: ఇది ఆ పదార్ధంలో ఉండే పోషకాలుకు సంబందించిన వివరాలను తెలియజేస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహరంలో కేలరీలను కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, చక్కెర, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలుగా విభజిస్తారు. కాబట్టి, వీటిని అర్థం చేసుకునేందుకు (RDA) రెకమెండరీ డైటరీ అలవెనస్ విలువలను చెక్ చేసుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? సున్నా ట్రాన్స్-ఫ్యాట్ స్థాయిలు ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోండి.
ప్యాకేజింగ్ నాణ్యత: మనం తీసుకుంటున్న పదార్థం యొక్క ప్యాకేజింగ్ నీట్ గా ఉండాలి. చెక్కుచెదరకుండా, ట్యాంపరింగ్, ఉబ్బడం, లీకేజీలు లాంటివి లేకుండా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్యాకేజ్ లో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఆ ఆహారం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. అలాగే, ప్రతి ఆహార ప్యాకేజీపై FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లోగో ఉందా చూసుకోవాలి. ఇది ఆహారం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తెలియజేస్తుంది.
పదార్థాల జాబితా: ఇది ఆ పదార్థం తయారుచేయడానికి ఉపయోగించిన వాటి గురించి తెలియజేస్తుంది. ఆ పదార్థంలో ఏవైనా అలెర్జీ కారకాలు, ఫుడ్ కలర్స్, టేస్ట్ కెమికల్స్ వంటివి ఏమైనా వాడారా అనేది తెలుసుకోవచ్చు. సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.
Packaged Food: ప్యాకేజింగ్ ఫుడ్ వాడటం, తినడం చాలా ప్రమాదమట. ఎందుకంటే, పదార్థాలు ఎక్కువకాలం పాడవకుండా ఉండటానికి వాటిలో కెమికల్స్ ను వాడుతున్నారు.