Pashamylaram : సిగాచి పరిశ్రమ ఘటనలో 37కు చేరిన మృతుల సంఖ్య

Follow

Pashamylaram : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషామైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రకటన వెలువడింది.
Khammam: దారి తప్పిన ఎస్సై.. భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య..!
ఇదిలా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించనున్నారు. గాయపడిన బాధితులను పరామర్శించి, పరిస్థితిపై సమగ్ర నివేదిక తీసుకోనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం సంఘటన స్థలాన్ని పూర్తిగా ముట్టడి చేసిన అధికారులు విషపూరిత వాయువుల వాసన లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పక్క పక్కన ఉన్న ఇతర పరిశ్రమలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పరిశ్రమల భద్రత ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
Pashamylaram : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషామైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు