pawan kalyan : అలా అడగ్గానే ఇలా సాయం చేసిన పవన్.. పాకిజాకు పవన్ సాయం..

Follow

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఆమె దీనస్థితి తెలిసి రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ లు ఆమెకు అందజేశారు.
Hari Hara Veera Mallu : చిరంజీవి చేతుల మీదుగా హరిహర వీరమల్లు ట్రైలర్!
ఈ సందర్భంగా వాసుకీ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని, తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించారని చెప్పారు. పవన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.
అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, పెదరాయుడు.. లాంటి అనేక తెలుగు, తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది వాసుకీ. ఆమె పాకీజా అనే క్యారెక్టర్ పేరుతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. గతకొంతకాలంగా ఆమె దీన స్థితిలో బతుకుంది. ఈ క్రమంలో డిప్యూటీ కళ్యాణ్‌ను సాయం చేయాలని కోరుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది.
Hari Hara Veera Mallu : చిరంజీవి చేతుల మీదుగా హరిహర వీరమల్లు ట్రైలర్!
స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెకు తనవంతు సాయం అందించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారు.