Peddi : ‘పెద్ది’ సినిమాలో రొమాంటిక్ షెడ్యూల్‌కు లైన్ క్లియర్!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Ram Charans Peddi Heads To Delhi For Romantic Schedule With Janhvi Kapoor

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌ను మేకర్స్ పూర్తి చేశారు. ఇక తాజాగా పెద్ది సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది.

Also Read : Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?

ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను జూలై 12న ఢిల్లీలో ప్రొరంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రామ్ చరణ్, జాన్వీ లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. దీంతో పాటు ఒకట్రెండు పాటలు కూడా ఇక్కడే షూట్ జరుపుకోనున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

​గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *