Peddi Sudarshan Reddy | ధాన్యం టెండర్ల స్కాంపై మౌనం ఎందుకు..? : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Peddi Brsd

Peddi Sudarshan Reddy | హైదరాబాద్ జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కోర్టులో బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై పిటిష‌న్ దాఖ‌లు చేసిందని తెలిపారు. అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు 16 సార్లు వాయిదా కోరడంలో అంతర్యం ఏంటని నిలదీశారు. అన్ని ఆధారాలతోవిజిలెన్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం టెండర్లలో కేవలం నలుగురు బిడ్డలు మాత్రమే పాల్గొన్నారు. మద్దతు ధరకు మించి మిల్లర్ల వద్ద రూ. 2230లకు క్వింటాల్ చొప్పున 35 లక్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని.. ఇందులో 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపారని చెప్పారు. దీనిపై 270 మంది బ్యాంకు ఖాతాలు సేకరించి నగదు బదిలీ అయినట్టు ఆధారాలతో బీఆర్ఎస్ బ‌ట్ట‌బ‌య‌లు చేసిందన్నారు. ఈ స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. అక్రమాల ద్వారా సమకూరిన 1100 కోట్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 10 కోట్ల చొప్పున అందజేశారని, ఇందులో కొంత మొత్తాన్ని ఢిల్లీకి మూటలు పంపారని విమర్శించారు.. మిగిలిన మొత్తాన్ని సీఎం రేవంత్, మంత్రి ఉత్త‌మ్ పంచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంపై బీజేపీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ, ఈడి విచారణ కోరాలని డిమాండ్ చేశారు. లేదంటే రెండు పార్టీలు ఒకటే అనే విషయం ఒప్పుకోవాలన్నారు. ధాన్యం కుంభకోణంపై ప్రభుత్వం స్పందించకుంటే సివిల్ సప్లై కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ విదేశాల నుంచి రాగానే ఇన్దుకు సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

​Peddi Sudarshan Reddy | ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *