Pezeshkian | ప్రధాని మోదీకి ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఫోన్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Pezeshkian

Pezeshkian : ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్‌ వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ కొనసాగింది. ఇరాన్‌లో పరిస్థితి గురించి ఈ సందర్భంగా ప్రధానికి పెజెష్కియాన్‌ వివరించారు.

భారత్‌ను తనకు మంచి మిత్రుడుగా, శాంతిని పెంపొందించే భాగస్వామిగా అభివర్ణించారు. చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఇజ్రాయెల్‌-ఇరాన్ దేశాలు శాంతిని నెలకొల్పుకోవాలని సూచన చేసినందుకు ప్రధాని మోదీకి పెజెష్కియాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనడంలో భారత గళం, పాత్ర చాలా కీలకమని పెజెష్కియాన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

కాగా ఇజ్రాయెల్-ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ తరఫున అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అయితే అమెరికా తమపై ప్రత్యక్ష దాడికి దిగడంపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై దాడులు చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

Read More >>

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. రియాద్‌కు దారి మళ్లింపు

ఇరాన్‌ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌

ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్‌.. అమెరికాలోని పలుచోట్ల హై అలర్ట్‌

‘పహల్గాం’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు అరెస్ట్‌

అమెరికా మొదలు పెట్టింది.. మేం అంతం చేస్తాం : ఇరాన్‌

​Pezeshkian | ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్‌ వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ కొనసాగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *