PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!

Follow

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు 19 విడతల డబ్బు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కాగా, 20వ విడత పిఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ 2025 చివరి నాటికి పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన మొత్తం జమ అవుతుందని ఇప్పటికే ఊహించినప్పటికీ, డబ్బు ఇంకా జమ కాకపోవడంతో దానికి సంబంధించి కొత్త సమాచారం విడుదలైంది.
ఇది కూడా చదవండి: Metro Rules Change: ఆ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.6,000 జమ చేస్తుంది. అంటే, ఈ రూ.6,000 ఒకేసారి జమ కావు. విడుత వారిగా అంటే మూడు సమాన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 జమ చేయబడుతుంది. దీని ప్రకారం, ప్రధానమంత్రి కిసాన్ ప్రారంభించినప్పటి నుండి, 19 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ అయిపోయింది. ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది.
20వ విడత ఎప్పుడు?
ఫిబ్రవరిలో రైతుల బ్యాంకు ఖాతాలకు PM కిసాన్ 2025 19వ విడత జమ అయింది. ఇప్పుడు 4 నెలలు గడిచాయి. అందుకే రైతులు 20వ విడత ఎప్పుడు అందుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 20వ విడత గురించి కేంద్రం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జూలై మొదటి వారంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే ఈ విడత పొందాలంటే రైతులు ఈకేవైసీ చేయడం ముఖ్యం. రైతులు తమ పీఎం కిసాన్ ఖాతాలో e-KYC చేయకపోతే, వారికి 20వ విడత రూ. 2,000 రావని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: EV Technology: 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. 3000 కి.మీ మైలేజీ.. సంచలనం సృష్టించనున్న ఈవీ టెక్నాలజీ!
Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్!
ఇది కూడా చదవండి: Monthly Horoscope: ఈ రాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతోందో తెలుసా? కుటుంబంలో విభేదాలు, అధిక ఖర్చులు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.6,000 జమ చేస్తుంది. అంటే, ఈ రూ.6,000..