Prabhas | కిర‌ణ్ అబ్బ‌వ‌రం మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. ప్ర‌భాస్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని కాపీ కొట్టావా ఏంటి?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rar

Prabhas |  టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. హిట్‌, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయ‌న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం K-RAMP. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. యుక్తి తర్జా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ మరియు శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.ఈ రోజు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం మాస్ అవతారంలో మెరిసాడు.

చేతులతో లుంగీ పట్టుకుని స్టైల్‌గా ముందుకు నడుస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయన వెనుక భాగంలో ఫైర్ ఎఫెక్ట్‌లతో తయారైన హార్ట్ షేప్ బాటిల్స్ డెకరేషన్ బాగుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కొన్ని వర్గాలు ఈ పోస్టర్ డిజైన్‌ను ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ పోస్టర్‌కు పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయం పై యూనిట్ ఇంకా స్పందించలేదు.ఇక ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం – చేతన్ భరద్వాజ్ కలయికలో ఇది మూడో చిత్రం.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలు మంచి స్పందన పొందాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యారు. K-RAMP చిత్రం 2025లో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి కిరణ్ అబ్బవరం ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఇక ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్ ఈ ఏ డాది మేలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ అద్భుతమైన క్షణాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ఫొటోను షేర్ చేశాడు. కొడుకు వ‌చ్చిన వేళా విశేషంతో మూవీతో పెద్ద సక్సెస్ అందుకుంటాడా అనేది చూడాలి.

​Prabhas |  టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. హిట్‌, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయ‌న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం K-RAMP. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *