Producer Sirish | దిల్ రాజు సోద‌రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మండిప‌డుతున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Sirish

Producer Sirish |  దిల్ రాజు సోదరుడు, ప్ర‌ముఖ‌ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత శిరీష్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. గేమ్ ఛేంజర్ ఫలితం మీద, రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయ‌లేదన్న విష‌యంలో శిరీష్ మ‌ట్లాడిన మాట‌లు వివాదానికి తెర‌లేపాయి. నిర్మాత నాగవంశీపై ప్రశంసలు కురిపిస్తూనే మైత్రి మూవీ మేకర్స్‌పై ఆరోపణలు చేశారు శిరీష్‌. మ‌రోవైపు రామ్ చరణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యల‌తో ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ‌ మొదలవడంతో పాటు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్‌కు కూడా దారి తీస్తున్నాయి. శిరీష్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లను నిజంగా ఆలోచించే నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది నాగవంశీ. ఆయన చేసిన సినిమాల వల్ల ఎవరైనా నష్టపోతే వెంటనే వాటిని పూడ్చే ప్రయత్నం చేస్తారు.

నా విషయంలో కూడా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లకు ఆయన సాయం చేశారు. అందుకే ఆయన ఎలాంటి రేటు చెప్పినా మేం వెంటనే తీసుకుంటాం,” అంటూ పేర్కొన్నారు. కానీ మైత్రిలో అలా ఉండ‌దు. ప్రతీ సారి ఎక్కువ రేట్లు చెబుతుంటారని, వారు చెప్పిన రేట్లకే కొనాల్సి ఉంటుందని, అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఎంత నష్టపోయినా మైత్రి వాళ్లు పట్టించుకోరు అని శిరీష్ చెప్పుకొచ్చారు. మైత్రి నుంచి తీసుకున్న సవ్యసాచి వల్ల మేం రూ.3 కోట్ల నష్టం చూసాం. గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి వల్ల ఒక్కొక్క మూవీకి రూ.2 కోట్ల నష్టపోయాం. కొన్ని సర్దుబాటు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ చేయలేదు అని ఆరోపించారు.

శిరీష్ చెప్పిన దాని ప్రకారం, ఉప్పెన సమయంలో మైత్రితో విభేదాలు వచ్చాయని, ఆ సినిమా వాళ్లే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారని చెప్పారు. పుష్ప సినిమాలో కూడా రేటింగ్ విషయంలో తేడాలు వచ్చాయని తెలిపారు. ఆచార్య సినిమాకు కొరటాల శివ చెప్పిన ధర అధికంగా ఉండటంతో, చివరికి వారు ఆ డీల్ నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. ఆ సినిమా వరంగల్ శ్రీన్‌కు వెళ్లి భారీ నష్టాలను తెచ్చిందని వివరించారు.“డబ్బింగ్ రూపంలో వచ్చిన పెద్దన్న (అన్నాత్తే)కి రూ.12 కోట్లు నష్టపోయాం. బీస్ట్, వేట్టయాన్ వంటి సినిమాలు కూడా నష్టాల్లో పడ్డాయి. ఒక్క జైలర్ మాత్రమే లాభాలు తీసుకువచ్చింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం సునీల్ నారంగ్‌తో జరిగిన కూలీ సినిమా డీల్‌ను ప్రస్తావిస్తూ, మొదట ఇది రూ.30 కోట్లకు లాక్ అయిందని, ఇప్పుడు క్రేజ్ పెరగడంతో రూ.45 కోట్ల వరకు చేరినట్టు వెల్లడించారు.శిరీష్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

​Producer Sirish |  దిల్ రాజు సోదరుడు, ప్ర‌ముఖ‌ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత శిరీష్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. గేమ్ ఛేంజర్ ఫలితం మీద, రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయ‌లేదన్న విష‌యంలో శిరీష్ మ‌ట్లాడిన మాట‌లు వివాదానికి తెర‌లేపాయి. నిర్మాత నాగవంశీపై ప్రశంసలు కురిపిస్తూనే మైత్రి మూవీ మేకర్స్‌పై ఆరోపణలు చేశారు శిరీష్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *