Rains | రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

Follow

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధ వారాల్లో) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం అంతటా ఆకాశం మేఘావృతమై ఉన్నదని పేర్కొంది. ఈ నెల 3, 4 తేదీల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశముందని చెప్పింది.
కాగా నగరంలో గత రాత్రి భారీ వర్షం పడింది. పంజాగుట్ట, లక్డీకాపూల్, మలక్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా వరదనీరు నిలిచింది. లక్డీకాపూల్ ద్వారకా హోటల్ కూడలిలో నిలిచిన నీటిని హైడ్రా సిబ్బంది మ్యాన్‌హోళ్లలోకి మళ్లించారు. బలమైన ఈదురుగాలులవల్ల మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Rains | రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధ వారాల్లో) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.