Rajasaab | రాజాసాబ్‌ టీజర్‌ లీక్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యూనిట్‌ సభ్యులు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rajasaab

Rajasaab | బంజారాహిల్స్‌, జూన్ 19 : ప్రభాస్‌ హీరోగా నటించిన రాజాసాబ్‌ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందే లీకైన‌ట్లు స‌మాచారం. ఈ టీజ‌ర్‌ను లీక్ చేసిన‌ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమా టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేశారు. అయితే అంతకుముందుగానే కొన్ని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల మీద టీజర్‌ కనిపించినట్లు చిత్ర యూనిట్‌ గుర్తించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 2లోని సాగర్‌ సొసైటీలోని వారాహి స్టూడియోస్‌లో టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్‌ జరిగిందని, అక్కడినుంచి టీజర్‌ లీక్‌ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసాబ్‌ సినిమా డబ్బింగ్‌ ఇన్‌చార్జ్‌ వసంత్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

​Rajasaab | ప్రభాస్‌ హీరోగా నటించిన రాజాసాబ్‌ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందే లీకైన‌ట్లు స‌మాచారం. ఈ టీజ‌ర్‌ను లీక్ చేసిన‌ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *