RajniKanth : ఆ దర్శకుడితో రజనీ సినిమా.. వర్కౌట్ అవుతుందా.?​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Will Rajinis Film With That Director Work Out

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా బిజినెస్ పెంచేలా చేసింది. షూటింగ్ ముగించుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read : Genelia : సౌత్ సినిమాకు ఎప్పటికీ రుణపడి ఉంటా

ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై డిస్కషన్ మొదలైంది. చెన్నై వర్గల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ కథలు వినే పనిలో ఉన్నారట. ఆల్రెడీ రజనితో వెట్టయాన్ సినిమాను డైరెక్ట్ చేసిన టీజీ జ్ఞానవేల్ ఓ పాయింట్ చెప్పి ఉన్నారు. అలాగే మహారాజ దర్శకుడు కూడా స్టోరీ నేరేట్ చేసాడట. ఇక లేటెస్ట్ గా మరొక స్టార్ దర్శకుడు సువర్ స్టార్ ను కలిసాడు. అజిత్ తో వలిమై, తూనీవు వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన హెచ్ వినోద్ రజనీకాంత్ ను కలిసి పవర్ఫుల్ కథ వినిపించగా అందుకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం విజయ్ తో జననాయగన్ సినిమాను డైరెక్ట్ చేసున్నాడు హెచ్ వినోద్. ఆ సినిమా ఫినిష్ అయిన వెంటనే రజనీకాంత్ తో సినిమా చేసేందుకుదుకు రెడీ అవుతన్నాడు. కానీ ఇంతవరకు ప్యూర్ కమర్షియల్ సినిమా చేయలేదు వినోద్. అటు రజిని సినిమాలు చూస్తే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఎలా ఉంటుందో అనే క్యూరియాసీటి ట్రేడ్ లో ఉంది.

​సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా బిజినెస్ పెంచేలా చేసింది. షూటింగ్ ముగించుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read : Genelia :  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *