Ramannapet : ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : ఎస్‌కే చాంద్

Follow

రామన్నపేట, జూన్30 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్ అన్నారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. మండల అధ్యక్షుడు నోముల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, రెబ్బాసు రాములు, ఎండీ ఇమామ్, ఆముద శ్రీను, ఎండీ యాకూబ్, మేడి కృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్ అన్నారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు.