Ramchander Rao: నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ కార్యకర్తను.. మీ సేవకుడినే!

Follow

Ramchander Rao: ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది అని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నాకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాను.. ప్రతి కార్యకర్త గర్వించాలి.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు. నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ కార్యకర్తనే.. మీ సేవకుడినే పేర్కొన్నారు. కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనసంఘ్ అభ్యర్ధి పోటీ చేస్తే వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయి.. కమ్యూనిస్టు పార్టీ గెలిచింది.. ఆనాడు జనసంఘ్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాల్చారు.. ఇదేందని కమ్యూనిస్టులు అడిగితే గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబురాలు చేసుకుంటున్నామని చెప్పారు.. ఇవాళ అదే ఉత్సాహంతో తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ, 3 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నామని రామచందర్ రావు తెలిపారు.
Read Also: MP: చదువు విషయంలో స్నేహితురాళ్ల మధ్య మనస్పర్థలు.. చైల్డ్‌ఫ్రెండ్‌పై యాసిడ్‌తో దాడి
అయితే, పార్టీ కోసం సైకిల్ పై రాష్ట్రమంతటా తిరుగుతూ ఎంతో కష్టపడ్డామని టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు పేర్కొన్నారు. బీజేపీ ఈ స్థాయికి వచ్చిందంటే.. ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు త్యాగాలున్నాయి.. మీ చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగింది.. అందరి ఆశీస్సులతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉంది.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాల వల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది.. బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ, సిద్ధాంత బలమున్న పార్టీ.. కలిసికట్టుగా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని తెలిపారు. బీజేపీలో కొత్త, పాత అనే పంచాయతీ లేదు.. నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందే అన్నారు. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాల్సిందే అని రామచందర్ రావు వెల్లడించారు.
Read Also: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్‌పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
ఇక, యువకులారా.. మహిళలారా.. బీజేపీలోకి రండి అంటూ రామచందర్ రావు పిలుపునిచ్చారు. 33 శాతం రిజర్వేషన్ల ఆమలుతో మహిళలకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పని చేస్తాను.. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ యూనివర్శిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.. స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని పోరాడుదాం.. మీకు దమ్ముంటే.. నేరుగా ఎదురుగా పోరాడదాం.. నేను క్రిమినల్ లాయర్ ను.. ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడనని తేల్చి చెప్పారు. రామచంద్రరావు సౌమ్యుడినే.. యుద్దంలోకి దిగితే యోధుడినే.. కత్తి దూయడంలో ముందుంటానని చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణ ప్రజల తరపున అలుపెరుగని పోరాటం చేస్తానని తెలంగాణ కమలం పార్టీ అధినేత తెలిపారు.
Ramchander Rao: ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది అని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నాకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాను.. ప్రతి కార్యకర్త గర్వించాలి.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.