RAPO 22 : రాజమండ్రిలో హీరో ‘రామ్’ హొటల్ రూమ్ దగ్గర హైడ్రామా

Follow

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరుగుతుంది. అందుకోసం రామ్ రాజమండ్రిలోని షెరటాన్ హోటల్‌లో బస చేస్తున్నారు. రామ్ స్టే చేస్తున్న హోటల్ దగ్గర హైడ్రామా జరిగింది. సోమవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్ కు చేరుకున్న రామ్ 6వ అంతస్తులోని VIP గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో, ఇద్దరు ఆగంతకులు హీరో రామ్ తరపున స్టాఫ్ లో భాగమని చెప్పుకుంటూ హోటల్ సిబ్బందిని సంప్రదించి లిఫ్ట్ యాక్సెస్ కోరారు.
Also Read : Dil Raju : తమ్ముడు” నో డౌట్.. నితిన్ కు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది
మొదట వారిని అనుమంచియాన హోటల్ యాజమాన్యం వారి మాయమాటలు నమ్మి వారికి యాక్సెస్ మంజూరు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ లో 6వ అంతస్తులోని రామ్ గది వద్దకు చేరుకొని మాస్టర్ కీ ఇవ్వాలని హౌస్ కీపింగ్ సిబ్బందితో చిన్నపాటి వాదనకు దిగారు. కీ తీసుకున్న ఆ ఇద్దరు దానిని ఉపయోగించి రామ్ గదిలోకి ప్రవేశించారు. అయితే VIP సూట్ కావడంతో, ఆ గదిలో లోపల మరో బెడ్‌రూమ్ ఉంది, అక్కడ రామ్ తలుపు లాక్ చేసి నిద్రిస్తున్నాడు. ఆ ఇద్దరు రామ్ నిద్రిస్తున్న రూమ్ డోర్ ను గట్టిగా తన్నడంతో మేల్కొని ఎదో జరుగుతుందని గ్రహించి వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీని లైన్ లోకి తీసుకున్నాడు. వాళ్లు వెంటనే రామ్ రూమ్ వద్దకు చేరుకొని ఆ ఇద్దరు అగంతలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చెరుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరుగుతుంది. అందుకోసం రామ్ రాజమండ్రిలోని షెరటాన్ హోటల్‌లో బస చేస్తున్నారు. రామ్ స్టే చేస్తున్న హోటల్ దగ్గర హైడ్రామా జరిగింది. సోమవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్ కు చేరుకున్న రామ్ 6వ అంతస్తులోని VIP గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో, ఇద్దరు ఆగంతకులు హీరో రామ్ తరపున స్టాఫ్