Rayudu Gari Military Hotel: తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. భగ్గుమన్న జనసేన నేతలు, భక్తులు.. దాడి చేస్తామని వార్నింగ్

Follow

Rayudu Gari Military Hotel: తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో రాజమండ్రిలో ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన నేతలు, హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. హోటల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు, ఛైర్మన్ బీఆర్ నాయుడికి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో తిరుమల ఆలయ నమూనాతో ఇలా నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయటంపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు.
రాజమండ్రి జాతీయ హైవే దగ్గర ఉన్న రాయుడు మిలిటరీ హోటల్ లో శ్రీవారి గర్భాలయ నమూనా ఏర్పాటు చేశారు. జయ, విజయలతో పాటు బంగారు వాకిలి, రాముల వారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయాన్ని ఇక్కడ పెట్టారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను ఆపహాస్యం చేస్తూ వ్యాపారానికి వాడుకున్నట్లేనని మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయ నమూనాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ హెచ్చరించారు.
”భక్తిశ్రద్దలతో ఆ దేవుడి ప్రసాదాన్ని లక్షల మందికి పెడుతుంటే నీ స్వార్థం, నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని, గొప్ప ప్రసాదం పెడతానని నాన్ వెజ్ పెడుతున్నారు. మేము అవి పెడుతున్నామా? ఎంత దారుణం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. దీనిపై వందలాది మంది భక్తులు మాకు ఫిర్యాదు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. మనసుకు చాలా బాధ వేసింది. వ్యాపారం కోసం అతడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
వెంటనే మేము టీటీడీ ఈవోని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే హైవే అథారిటీస్ ఆ హోటల్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారి గురించి ఆరా తీస్తున్నారు. 48 గంట్లల్లో ఆ హోటల్ లో ఆ సెటప్ తీసేయాలి. లేదా హోటల్ ను వెజిటేరియన్ చేసుకో. లేకపోతే హోటల్ పై వేంకటేశ్వరస్వామి భక్తులు దాడి చేస్తారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. హిందూ మతంతో ఆడుకోవద్దు” అని కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు.
నీ స్వార్థం కోసం నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని నాన్ వెజ్ పెడుతున్నారు. ఎంత దారుణం..