Rekha Boyapally | ‘మనుస్మృతి’ పేరుతో మహిళల హక్కులను హరించే కుట్ర.. మండిపడిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rekha

Rekha Boyapally : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తోందని, మహిళా హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Rekha Boyapally) విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ఘోర ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం కాదు, మనుస్మృతి కావాలి. మహిళల హక్కులను తొలగించే ప్రయత్నమే ఇది.

ఈ మధ్య ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హోసబాలే ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక (Preamble) నుంచి తొలగించాలంటూ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే.. బీజేపీది భయంకరమైన భావజాలం అని రేఖ పేర్కొన్నారు.  అంతేకాదు మనుస్మృతిలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు రేఖ. అమ్మాయిలను చదువుకోవడానికి అనుమతించేవారు కాదని, ఆస్తి మీద హక్కు లేదని,. వింతతువులకు పెళ్లి చేయడంపై నిషేధం ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమ్మాయిలు ప్రేమ వివాహం చేసుకోవడం.. ఉద్యోగం చేయడం, స్వేచ్ఛగా జీవించడం వంటి వాటిని మనువాదులు నేరంగా పరిగణించేవాళ్లని రేఖ తెలిపారు.

డిమాండ్లు ఇవే

రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛను కల్పించిందని రేఖ అన్నారు. ఆర్టికల్ 14: సమానత్వం, ఆర్టికల్ 15: లింగ వివక్షను నిషేధించడం, ఆర్టికల్ 16 : సమాన ఉద్యోగ అవకాశాలు, ఆర్టికల్ 21: వ్యక్తిగత గౌరవం, స్వేచ్ఛతో జీవించే హక్కును రాజ్యాంగం మనకు ప్రసాదించిందని ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు బీజేపీ ముందుంచారు. అవేంటంటే.. మహిళలకు రాజ్యాంగ హక్కులకు పూర్తి రక్షణ ఇవ్వాలి.

రాజ్యంగా ప్రవేశికలోని “సోషలిస్టు”, “సెక్యులర్” పదాలను తొలగించకూడదని ఆమె బీజేపీని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రతి మహిళా తన హక్కుల కోసం మాట్లాడాలి. యువత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకోవాలి. బీజేపీ ప్రోత్సహిస్తున్న మతపరమైన భావజాలాన్ని అడ్డుకోవాలి అంటే రేఖ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

​Rekha Boyapally : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తోందని, మహిళా హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Rekha Boyapally) విమర్శించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *