Revanth Reddy | పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరీశించిన సీఎం.. నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశం

Follow

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. కమిటీలో కొత్తవాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చినవాళ్లు కమిటీలో ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది కార్మికులు, సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో మంత్రులు వివేక్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రమాద ప్రాంతంలో భవన శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై వివరాలు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి ముందు పరిశ్రమను తనిఖీ చేశారా అని కంపెనీ ప్రతినిధిని ప్రశ్నించారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇచ్చే పరిహారంపై ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో కంపెనీ యాజమాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్తవారితో జరిపించాలని, జరిపి పూర్తి నివేదిక అందించాలన్నారు. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా, జరిగితే కారణాలేంటో తెలుసుకోవాలన్నారు.
#WATCH | Sangareddy: Telangana CM Revanth Reddy reaches Sigachi Pharma Industries, where an explosion took place yesterday.
So far, 34 people have lost their lives in the explosion.
(Source: I&PR Telangana) pic.twitter.com/hdio0rPQpc
— ANI (@ANI) July 1, 2025
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. కమిటీలో కొత్తవాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చినవాళ్లు కమిటీలో ఉండకూడదని స్పష్టం చేశారు.