RGUKT | జూన్ 21తో ముగియనున్న ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల నమోదు ప్రక్రియ

Follow

RGUKT | బాసర, జూన్ 20 : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపే (జూన్ 21) చివరి తేదీగా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 18,775 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
జూలై 4న ప్రవేశ ఫలితాలు విడుదల చేయబడతాయి. జూలై 7న మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆర్జీయూకేటీ అందించే ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విద్యార్ధులకు ఉచిత నివాస విద్య, ఆధునిక ప్రయోగశాలలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వంటి అనేక వసతులు కల్పిస్తూ, ఈ విశ్వవిద్యాలయం విశిష్టతను చాటుకుంటోందని పేర్కొన్నారు.
RGUKT | రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపే (జూన్ 21) చివరి తేదీగా నిర్ణయించబడింది.