Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..

Follow

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్‌తో చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురా లేకపోయినా, తాజాగా భారీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మెంట్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి లీడ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. అంతేకాదు, ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే
Also read : Samantha : మధ్యాహ్నం కూర్చుంటే.. సాయంత్రం అయిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్
కన్నడ పరిశ్రమలో హీరోయిన్స్‌కు సాధారణంగా ఎక్కువ పారితోషికం ఉండదు. కానీ టాలీవుడ్‌లో మాత్రం వీరి కథే వేరుగా ఉంది. రుక్మిణి కూడా ఇప్పటివరకు తక్కువ పారితోషికానికే సినిమాలు చేసింది. కానీ ఎన్టీఆర్ మూవీ కోసం మాత్రం కోటిన్నర వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. పరిశ్రమ వర్గాల టాక్ ప్రకారం ఇది అంగీకరించినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటం తో, స్టార్ హీరోయిన్స్ 5–6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండటం కామన్ అయిపోయింది. అందులో రుక్మిణి డిమాండ్ కూడా న్యాయంగానే ఉందని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం అంటే ఏ హీరోయిన్‌కైనా గోల్డెన్ ఛాన్స్ అనే. ఇప్పుడు రుక్మిణికి ఆ అవకాశం దక్కడంతో ఆమెకు ఇక్కడ స్టార్ ఇమేజ్ రావడం ఖాయమని అభిప్రాయం నడుస్తోంది.
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్‌తో చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురా లేకపోయినా, తాజాగా భారీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మెంట్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన