Rythu Bharosa: 15ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు జమ.. డబ్బులు పడనివాళ్లు ఇలా చేయండి..

Follow

Rythu Bharosa: రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు ‘రైతుభరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని రెండు దఫాలుగా అందిస్తోంది. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్‌కుగాను అర్హులైన రైతుల ఖాతాల్లో దశల వారిగా ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం వరకు 15ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
పదిహేను ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం 513.83కోట్లు విడుదల చేయడం జరిగింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8284.66కోట్ల రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు.
జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో దశల వారిగా ఎకరాలనుబట్టి రైతులు ఖాతాల్లో నిధులు జమచేస్తూ వస్తోంది. శుక్రవారం 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 908.80 కోట్లు విడుదల చేసింది. శనివారం తొమ్మిది ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ చేసింది. 1,06,516 మంది రైతులకు చెందిన 7.67 లక్షల ఎకరాలకు సంబంధించి 460.24 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. సోమవారం 15 ఎకరాలలోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి రూ.513 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
రైతు భరోసా డబ్బులు పడ్డాయా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి?…
రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయా..? లేదా..? అనేది ఎలా తీసుకోవాలంటే.. చాలా వరకు బ్యాంకులు రైతుల అకౌంట్లలో డబ్బులు పడినట్లుగా మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు పంపిస్తున్నాయి. అలాకాకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం ద్వారా రైతుభరోసా నిధులు జమ అయ్యాయో.. కాలేదో తెలుసుకోవచ్చు. అర్హత ఉన్నప్పటికీ.. రైతు భరోసా నిధులు జమకాని రైతులు.. సంబంధిత పత్రాలతో స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలను అందజేయాలని అధికారులు తెలిపారు.
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.