Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Follow

Samsung Galaxy S23 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ (Samsung Galaxy S23 Ultra 5G) ధర భారీగా తగ్గింది.
ప్రస్తుతం అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆఫర్. బ్యాంక్ ఆఫర్లతో ఈ శాంసంగ్ 5G ఫోన్ ప్రస్తుతం రూ.76,700 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
వాస్తవానికి, ఈ ఫోన్ రూ. 1,59,999కు లాంచ్ అయింది. డిజైన్, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాతో ప్రీమియం స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. అమెజాన్‌లో గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ (12GB, 512GB వేరియంట్) రూ.77,949కి అందుబాటులో ఉంది. లాంచ్ ధరలో దాదాపు సగం వరకు ఉంటుంది. కొనుగోలుదారులు ఎంపిక చేసిన కార్డులను (SBI, Axis, Federal, One Card) ఉపయోగించవచ్చు.
రూ.1,250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. నెలకు రూ.3,779 నుంచి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా ధరను దాదాపు రూ.77,949కి తగ్గించవచ్చు. మీ పాత ఫోన్ ట్రేడింగ్ కోసం మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.48,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ ప్రొటెక్షన్, ఇతర యాడ్-ఆన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ (Samsung Galaxy S23 Ultra 5G) 6.8-అంగుళాల పెద్ద అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,750 పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ ఆప్టిక్స్ కోసం 200MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. 10MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 12MP అల్ట్రావైడ్ సెన్సార్ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. తక్కువ ధరకే ఈ డీల్ ఇలా సొంతం చేసుకోండి.