Sashidhar Reddy | ఏడుపాయలకు 30 కాటేజీలు మంజూరు చేయండి : మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి

Follow

Sashidhar Reddy | పాపన్నపేట,జూన్ 19 : తెలంగాణలో ప్రసిద్ది చెందిన ఏడుపాయలకు 30 కాటేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని తెలిపారు.
2007లో ఈ ఏడుపాయల జాతరను రాష్ట్ర ఫెస్టివల్‌గా ప్రకటించారని చెప్పారు. 2008లో అప్పటి స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా మంత్రి గీతారెడ్డి రూ. 1.50కోట్లు మంజూరు చేసి కాటేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం భక్తులకు సరిపడా సత్రాలు లేక చాలా మంది చెట్ల కింద వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ వంటలు చేసుకుంటున్నారని వాపోయారు. కార్పోరేషన్ స్పందించి 30 కాటేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేసినట్లు శశిధర్‌రెడ్డి తెలిపారు.
Read Also :
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు
ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. 2007లో ఈ టెంపుల్‌ను రాష్ట్ర ఫెస్టివల్‌గా ప్రకటించారని చెప్పారు.