SC/ST Atrocities Case | సిరిసిల్లలో కాంగ్రెస్ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Follow

సిరిసిల్ల రూరల్ : తంగళ్లపల్లి మాజీ జడ్పీటీసీ పూర్మానీ మంజుల భర్త, కాంగ్రెస్ నేత పూర్మానీ లింగారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో లింగారెడ్డి A1గా ఉన్నారు. బాధితుడు డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయగా, ఎట్టకేలకు కేసు నమోదైనట్లు సమాచారం.
తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మాజీ సర్పంచ్, దళిత సంఘ నేత తంగళ్లపల్లి దేవయ్య ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దేవయ్య తన ఫిర్యాదులో, 2024 సెప్టెంబర్ 4న మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్‌లో తన కేబుల్ వైర్లను కోసి, సుమారు రూ.12 లక్షల నష్టం కలిగించారని ఆరోపించారు. అడ్డుకున్న తనపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై దేవయ్య, కాంగ్రెస్ నేత పూర్మాణీ లింగారెడ్డితో పాటు కే. అంజిరెడ్డి, ఎ. శ్రీకాంత్‌రెడ్డి, మిడిదొడ్డి ప్రశాంత్, టి. చందు, కే. వేణు, కే. సాయిరెడ్డిలపై ఈ ఏడాది మే 20న డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం, ఈనెల 23న కాంగ్రెస్ నేత పూర్మాణీ లింగారెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ జడ్పీటీసీ భర్తపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది.
Congress Leader in Sircilla | సిరిసిల్ల రూరల్, జూన్ 28: తంగళ్లపల్లి మాజీ జడ్పీటీసీ పూర్మానీ మంజుల భర్త, కాంగ్రెస్ నేత పూర్మానీ లింగారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో లింగారెడ్డి A1గా ఉన్నారు.