School Teacher | 24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
School

School Teacher | విద్యార్థులకు (Students) మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే (School Teacher) కీచకుడయ్యాడు. పాఠశాలలోని పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వెలుగుచూసింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్మౌర్‌ (Sirmaur) జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అధికారులు ‘శిక్ష సంవాద్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. గణితం బోధిస్తున్న ఉపాధ్యాయుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్‌ ఇచ్చారు. తమను అసభ్యకరంగా తాకాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రిన్సిపల్‌.. విద్యాశాఖ అధికారులు, లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన విద్యాశాఖ ఉన్నతాధికారులు.. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే, దర్యాప్తులో విద్యార్థుల ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Also Read..

Shashi Tharoor | ఆ వ్యాఖ్యలు బీజేపీలో చేరికకు సంకేతాలు కావు : శశిథరూర్‌

Gautam Adani | భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసు.. ఆపరేషన్‌ సిందూర్‌పై గౌతమ్‌ అదానీ

actor sri ram | డ్రగ్స్‌ కేసు.. నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

​School Teacher | విద్యార్థులకు (Students) మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే (School Teacher) కీచకుడయ్యాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *