Siddharth : యంగ్ హీరో యాటిట్యూట్ తో దర్శకులకు తలనొప్పి

Follow

ఈ మధ్య కాలంలో హీరోలకు క్రియేటివిటీ ఎక్కువై తమ పనితో పాటు ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తమ సినిమా అని ఫీలవ్వడంలో తప్పు లేదు కానీ దర్శకులు, రైటర్స్ పనిలో కూడా వేలు పెడుతున్నారు. అవే చిలికి చిలికి క్రియేటివ్ డిఫరెన్స్‌కు దారి తీస్తున్నాయి.అన్ని చిత్ర పరిశ్రమలలో ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. బాలీవుడ్‌లో ఈ కల్చర్ మరీ ఎక్కువైందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇటువంటి వార్తతోనే హీరో సిద్దార్థ్ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ముంబయిగా నిలిచాడు.
ఈ మధ్య దేశభక్తి చిత్రాలతో ఎంటర్టైన్ చేసిన సిద్దార్థ్ మల్హోత్రా మళ్లీ లవ్ అండ్ డ్రామా చిత్రాలకు యూటర్న్ తీసుకున్నాడు. పరమ్ సుందరితో పాటు వివాన్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న పరమ్ సుందరి త్వరలో థియేటర్లలోకి రాబోతోంది. ఇదే కాకుండా ఫోక్ థ్రిల్లర్ వివాన్ చేస్తున్నాడు. మూవీ ఎనౌన్స్ అయ్యింది.. సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి. ఇదిగో ఇదే టైంలో వివాన్ దర్శకుడు దీపక్ మిశ్రా కుమార్‌తో విబేధాలు వచ్చాయంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రి ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని దీంతో దర్శకుడు తప్పుకున్నాడని టాక్. ఈ వివాదంపై వివాన్ డైరెక్టర్ దీపక్ స్పందిస్తూ ఇదంతా ఫాల్స్ స్టేట్ మెంట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు కానీ సిద్దు టీం స్పందించలేదు సిద్దార్థ్ ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ మిట్టి అనే ప్రాజెక్టుకు కమిటైన కియారా హజ్బెండ్.. సినిమా సెట్స్‌పైకి వెళుతుండగా దర్శకుడు బల్వీందర్ సింగ్‌తో పేచీలు పెట్టుకున్నాడు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. సాధారణంగా చాలా కూల్‌గా కనిపించే సిద్దూ ఈ తరహా యాటిట్యూట్ చూపిస్తే ఇండస్ట్రీలో స్టార్ ఎదగడం కష్టం. అది తెలుసుకుంటే మంచిది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో హీరోలకు క్రియేటివిటీ ఎక్కువై తమ పనితో పాటు ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తమ సినిమా అని ఫీలవ్వడంలో తప్పు లేదు కానీ దర్శకులు, రైటర్స్ పనిలో కూడా వేలు పెడుతున్నారు. అవే చిలికి చిలికి క్రియేటివ్ డిఫరెన్స్‌కు దారి తీస్తున్నాయి.అన్ని చిత్ర పరిశ్రమలలో ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. బాలీవుడ్‌లో ఈ కల్చర్ మరీ ఎక్కువైందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇటువంటి వార్తతోనే హీరో సిద్దార్థ్ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ముంబయిగా