Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..

ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ 24 ఏళ్ల యువతి అదృశ్యం కావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్ అనే యువతి పెద్దలు కుదిర్చిన వివాహం కోసం  జూన్ 20న అమెరికాకు చేరుకుంది. అయితే ఆమె ఆమెరికాకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు ఆమె కోసం వెతగ్గా ఆచూకీ లభించలేదు.. ఇక చేసేదేమి లేక వారు అమెరికా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అమెరికా పోలీసులు ఘటనా స్థలంలోని స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా..అందులో తప్పిపోవడానికి కొద్ది సేపు ముందు సిమ్రన్ తన ఫోన్ చూస్తూ ఎవరి కోసమో ఎదురుచూస్తుండడం కనిపించిందని అమెరికా పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఆమెలో తప్పిపోయానన్న ఎలాంటి ఆందోళన కూడా కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

దీంతో సిమ్రాన్ మిస్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు ప్రాథమిక దర్యాప్తులో ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆమె నిజంగానే పెళ్లి కోసం అమెరికా వచ్చిందా..లేదా కేవలం ఉచిత విమాన ప్రయాణం చేసేందుకే పెళ్లి నాటకం ఆడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భారత్‌లోని సిమ్రన్ కుటుంబ సభ్యులను సంప్రందించేందుకు ప్రయత్నించినా..తమకు ఎలాంటి వివరాలు లభించలేదని అమెరికా పోలీసులు తెలిపారు.

మరోవైపు ఆమెను గుర్తించేందుకు ఆమె చవరిసారిగా వేసుకున్న దుస్తువులు, ఆమె ఎలా ఉంటుందనే వివరాళను పోలీసులు వెల్లడించారు. సిమ్రాన్ 5 అడుగుల 4 అంగుళాల పొడవు, 68 కిలోల బరువు ఉంటుందని, నుదిటిపై చిన్న మచ్చ ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు. సిమ్రాన్ బూడిద రంగు స్వెట్‌ప్యాంట్, తెల్లటి టీ-షర్ట్, చిన్న డైమండ్ చెవిపోగులు ధరించి కనిపించిందిని తెలిపారు. పైగా సిమ్రాన్‌కు ఇంగ్లీష్ మాట్లాడం కూడా రాదని.. అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ 24 ఏళ్ల యువతి ఐదురోజులకే అదృశ్యం కావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. యువతి బంధువల ఫిర్యాదుతో స్థానిక సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. ఆమె తప్పిపోవడానికి ముందు ఆమె ఫోన్‌ చూస్తూ ఎవరికోసమో వెయిట్‌ చేస్తున్నట్టు కనిపించింది. పైగా ఆమెలో ఎలాంటి ఆందోళన కూడా కనిపించకపోవడంతో ఈ మిస్సింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *