SL vs BAN : వీడెవండీ బాబు.. పాములు, కోతితో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు..

Follow

గాలె అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో ఓ సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స్టాండ్స్‌లో ఓ పాములు ఆడించే వ్యక్తి కనిపించాడు. వాస్తవానికి ఇందులో పెద్దగా విశేషం అయితే లేదుగానీ.. సదరు వ్యక్తి రెండు పాములతో స్టేడియంలోకి రావడం గమనార్హం.
ఆ వ్యక్తి నేలపై ప్రశాంతంగా కూర్చుని, ఒకటి కాదు రెండు పాములతో కనిపించాడు, జనసమూహంతో లేదా మ్యాచ్ తీవ్రతతో అతను ఇబ్బంది పడలేదు. సరీసృపాలలో ఒకదాన్ని తన చేతిలో క్యాజువల్‌గా పట్టుకుని మ్యాచ్ ఆఖరి రోజును ఆటను ఆస్వాదించాడు. ఓ కోతి కూడా అక్కడ ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ENG vs IND 1st test : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 ఆలౌట్
A Snake Charmer in Galle watching Sri Lanka Vs Bangladesh with Snakes and Monkey. pic.twitter.com/bcXmA6caUh
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తి చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఇలా స్టేడియాల్లోకి పాములు తీసుకువస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 495 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 485 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆరువాత శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఆట ఆఖరకు 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.
శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో ఓ సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది.