Social Responsibility | విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా.. రైతులకు వరి విత్తనాల పంపిణీ

Follow

Social Responsibility | శంకర్ పల్లి, జూన్ 23 : శంకర్‌పల్లి మండల పరిధిలోని గోపులారం గ్రామంలో క్షేత్రస్థాయిలో రైతులకు మద్దతుగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్‌కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ సహాయాన్ని స్వీకరించారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో విద్యార్థుల్లో సహానుభూతి, సామాజిక బాధ్యత పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పొడవు శ్రీనివాస్ తెలిపారు. ఈ విధంగా విద్యార్థులకు రైతుల కష్టాలు, పండించే ప్రక్రియపై అవగాహన కలిగితే భవిష్యత్తులో వారు వ్యవసాయం పట్ల గౌరవం కలిగి ఉంటారు అని ఆయన అన్నారు.
రాక్ వెల్ పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. రైతు దేశానికి వెన్నుముక, రైతులు పండించకపోతే ఆహారం ఉండదు. కేవలం విత్తనాలే కాదు, భవిష్యత్తులో మరిన్ని విధాలుగా మద్దతుగా.. సమాజపట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కలిగిందని వారు పేర్కొన్నారు. గ్రామస్థులెవ్వరూ ఈ సేవా కార్యక్రమాన్ని మరువలేరని, ఇలాంటి ఉదార చర్యలు మరెన్నో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ తేజ, అనిల్ కుమార్, వినాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన
Social Responsibility | మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్‌కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందజేశారు.