Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో నటించేది ఈ స్టార్ హీరోనే.. స్వయంగా చెప్పిన దాదా.. రిలీజ్ ఎప్పుడంటే?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో నటించేది ఈ స్టార్ హీరోనే.. స్వయంగా చెప్పిన దాదా.. రిలీజ్ ఎప్పుడంటే?

టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన గంగూలీకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చిన కెప్టెన్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఒక బయోపిక్ తెరకెక్కనుంది. కొన్ని రోజుల క్రితం గంగూలీనే స్వయంగా తన బయోపిక్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు.. తన బయోపిక్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, 2026 నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని గంగూలీ వెల్లడించారు. అంతే కాదు, ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తన బయోపిక్ లో లీడ్ రోల్ పోషిస్తాడని గంగూలీ స్వయంగా చెప్పారు. తాజాగా ఇదే విషయమై మరోసారి స్పందించాడు దాదా. పీటీఐతో మాట్లాడిన సౌరవ్ గంగూలీ తన బయోపిక్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో నటించనున్నారని క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని గంగూలీ చెప్పారు. షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టదని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పట్టవచ్చని గంగూలీ పేర్కొన్నారు.

గంగూలీ టీం ఇండియా తరపున 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 42.17 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 239 పరుగులు. ఇక వన్డే క్రికెట్‌లో 311 మ్యాచ్‌లు ఆడిన దాదా 42.02 సగటుతో 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, ఆటగాడి సేవలందించిన సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇక సౌరవ్ గంగూలీ బయోపిక్ కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

తన బయోపిక్ వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుందని గంగూలీ పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు విషయానికి వస్తే.. స్త్రీ, స్త్రీ 2, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిస్ మాహి, రూహి, చలాంగ్ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇటీవల రాజ్ కుమార్ రావు నటించిన భూల్ చౌక్ మాఫ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​టీమిండియా దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ పై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో తన బయోపిక్ లో లీడ్ రోల్ పోషిస్తాడని కొన్ని రోజుల క్రితమే గంగూలీ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *