Sreeleela: సినిమాలు ఆఫర్స్ తక్కువ.. రెమ్యునరేషన్ మాత్రం ఎక్కవ.. అస్సలు తగ్గేదేలే అంటున్న శ్రీలీల

Follow
సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల ఇమేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే రోజురోజుకీ ఈమె క్రేజ్ పెరుగుతుంది. ఇన్నాళ్ళూ తెలుగులో మాత్రమే మ్యాజిక్ చేసిన ఈ కిసిక్ బ్యూటీ.. పుష్ప 2 తర్వాత తన రేంజ్ బాలీవుడ్ అంటుంది.
అక్కడే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఉస్తాద్ మినహా.. శ్రీలీల చేతిలో తెలుగు సినిమాలేం లేవు.అఖిల్ లెనిన్ సినిమా నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తుంది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి వాకౌట్ చేసారు ఈ బ్యూటీ.
బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ ఆషికి 3 సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అక్కడ్నుంచి మరో రెండు మూడు సినిమాలు శ్రీలీల చెంతకు వస్తున్నాయి. దాంతో అమ్మడి రెమ్యునరేషన్ కూడా డబుల్ అయిపోయింది.
తెలుగులో శ్రీలీల పారితోషికం 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పుష్ప 2 తర్వాత అది ఇంకాస్త పెరిగింది. అయితే బాలీవుడ్లో మాత్రం అమ్మడు రేంజ్ 5 కోట్లకు పెరిగిందనే ప్రచారం జరుగుతుంది.
ఎంతైనా తెలుగమ్మాయి హిందీలో చక్రం తిప్పుతుంటే అది మనకేగా గర్వకారణం అంటున్నారు శ్రీలీల ఫ్యాన్స్. అన్నట్లు కన్నడలో జూనియర్.. తమిళంలో పరాశక్తి సినిమాలు కూడా చేస్తున్నారు ఈ భామ.
కొందరు హీరోయిన్లు సినిమాలు చేస్తున్నట్లే కనిపించరు.. కానీ వాళ్ళ డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు. శ్రీలీల కూడా ఇదే లిస్టులోకి వస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఈమె కనబడక చాలా రోజులైపోయింది.. ఆఫర్స్ కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అయినా కూడా ఈమె రెమ్యునరేషన్ డబుల్ అయింది. మరి ఏంటా మ్యాజిక్..?