Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?

Follow

Star Directors : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సత్తా వారిది. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఎంతో మందిని స్టార్లుగా నిలబెట్టారు. ఇండస్ట్రీకి ట్రెండ్ ను చూపించారు. మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పుడు ఏమైందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు డైరెక్టర్లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వారే వి.వి.వినాయక్, శ్రీనువైట్ల. వివి వినాయక్ అంటే పెద్ద యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉండేవారు. ఆయనతో సినిమా చేసేందుకు ఒకప్పుడు స్టార్ హీరోలు పోటీపడేవారు. కొందరు స్టార్లు తమ వారసులను లాంచ్ చేయాలంటే వినాయక్ ఉంటే బెటర్ అనుకునేవారు.
read also : Dilraju : రామ్ చరణ్ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా
అలాంటి వినాయక్ చివరి సినిమా ఛత్రపతి. రాజమౌలి-ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేశాడు. కానీ అది ప్లాప్ అయింది. అంతకు ముందు చేసిన జెంటిల్ మెన్, అఖిల్ కూడా ప్లాప్. ఖైదీ నెంబర్ 150 మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఒక దర్శకుడిగా ఇలాంటి ప్లాపులు ఎవరికైనా కామన్. కానీ ఈ సినిమాల తర్వాత వినాయక్ మరో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆయనతో మూవీలు చేసేందుకు ఇప్పటికీ చాలా మంది హీరోలు, నిర్మాతలు రెడీగానే ఉన్నారు.
కానీ ఎందుకో ఆయన సైలెంట్ అయిపోయారు. రెండేళ్లుగా ఆయన మరో సినిమాను ఓకే చేయలేదు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వినాయక్ మరో మంచి సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. శ్రీను వైట్ల మాస్, కామెడీ కలబోసిన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు వెంకీ (2004), ఢీ (2007), దుబాయ్ శీను (2007), రెడీ (2008), దూకుడు (2011), బాద్షా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఆగడు సినిమా నుంచే ఆయన ప్లాపులు మొదలయ్యాయి.
ఆ తర్వాత చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ, విశ్వం సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. త్వరలోనే మరో సినిమా వస్తారని అంటున్నారు. ఆయన మంచి హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. కామెడీ సీన్లు చేయాలంటే శ్రీనువైట్ల తర్వాతే ఎవరైనా. అలాంటి ఆయన నుంచి మరో మంచి మూవీ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
read also : Shriya Sharma : సమంత చెల్లెలు.. ఇప్పుడు టాప్ లాయర్..
Star Directors : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సత్తా వారిది. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఎంతో మందిని స్టార్లుగా నిలబెట్టారు. ఇండస్ట్రీకి ట్రెండ్ ను చూపించారు. మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పుడు ఏమైందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు డైరెక్టర్లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వారే వి.వి.వినాయక్, శ్రీనువైట్ల. వివి వినాయక్ అంటే పెద్ద యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్