Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?

Follow

ఈ ఏడాది సమ్మర్ ను ఖాళీగా వదిలేసారు స్టార్ హీరోలు. స్టార్ హీరోల సినిమాలు అన్నిఆగస్టు15, దసరా, దీపావళికి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అలానే ఈ ఏడాది సెప్టెంబరు లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మధ్య జరగబోతుంది. సెప్టెంబర్ 5లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : AN 63 : అల్లరి నరేష్ 63 టైటిల్ ‘ ఆల్కహాల్’..
అమరన్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శివకార్తికేయన్. తెలుగులోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ హీరో మురుగదాస్ దర్శకత్వంలో ‘మదరాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇక మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బైలింగువల్ సినిమా ‘కాంత’. రాణా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దుల్కర్ కు మలయాళం కు మించిన మార్కెట్ తెలుగులో ఉంది. లక్కీ భాస్కర్ తో వంద కోట్ల మార్క్ ను కూడా అందుకున్నాడు. అటు తమిళ్ లోను ఆ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దుల్కర్ నటిస్తున్న ‘కాంతా’ కూడా సెప్టెంబర్ 5న బరిలో దిగుతోంది. గమ్మత్తేమిటంటే గతేదాడి ఈ ఇద్దరి సినిమాలైన అమరన్, లక్కీ భాస్కర్ ఒకదానితో ఒకటి క్లాష్ ఏర్పడగా ఇద్దరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. మరి ఈసారి ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
ఈ ఏడాది సమ్మర్ ను ఖాళీగా వదిలేసారు స్టార్ హీరోలు. స్టార్ హీరోల సినిమాలు అన్నిఆగస్టు15, దసరా, దీపావళికి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అలానే ఈ ఏడాది సెప్టెంబరు లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మధ్య జరగబోతుంది. సెప్టెంబర్ 5లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : AN 63 : అల్లరి నరేష్