Tamil Nadu: కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Newlywed Sucide After Sending Message To Father Via Whatsapp

తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చివరి సందేశాన్ని వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపించింది. తాజాగా ఈ రికార్డ్ వాయిస్‌లు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ఆఫీస్‌లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో కవిన్ కుమార్ అనే యువకుడితో రిధన్య (27) వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపు రూ.కోటి వరకు కట్న, కానుకలు ఇచ్చారు. ఇంకేముంది కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారం తర్వాత అత్తారింటి స్వరూపం బయటపడింది. నిత్యం భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. అంతేనా అంటే అంతకు మంచి టార్చర్ చేయడం ప్రారంభించారు. భర్త కవిన్‌కుమార్ శారీరికంగా హింసిస్తుంటే.. మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. దీంతో రిధన్య కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఎంత కాలం బ్రతకాలంటూ తనకు తాను మరణశాసానాన్ని రాసుకుంది. తిరిగి పుట్టింటికి వెళ్లి రక్తసంబంధుకుల్ని బాధపెట్టకూడదని.. వాళ్లను మరింత వేదనకు గురి చేయకూడదని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకుంది. అయితే చివరిగా తన తండ్రికి వాట్సాప్‌ ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. అత్తారింట్లో అనుభవిస్తున్న నరకాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary : కూల్ వెదర్ లో మీనాక్షి చౌదరి హాట్ ఫొటోస్

‘‘నా భర్త, అతని కుటుంబ సభ్యులే నా మరణానికి కారణం. నేను రోజు శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురవుతున్నా. ఇక ఈ జీవితం నాకు వద్దు. వాళ్లు ఎప్పటికీ మారరు. అందుకే ఈ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. దీనికి భర్త కవిన్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవే కారణం. నా వివాహం విఫలమైంది. దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నాన్న.’’ అంటూ రిధన్య ఆడియో సందేశంలో ఆవేదన తెలియజేసింది. బిడ్డ మాటలు విన్న పేరెంట్స్ ఆవేదన చెందారు. అత్తారింట్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందని కన్నీరుమున్నీరు అయ్యారు.

రిధన్య కారులో ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో పురుగుల ముందు తాగి ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి రిధన్య వాట్సాప్ రికార్డుల ప్రకారం.. భర్త, అత్తామామలను అరెస్ట్ చేశారు.

​తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *