Tamil Nadu: శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి

Follow

తెలంగాణలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఇంకా తేరుకోక ముందే తమిళనాడులో కూడా మరో పేలుడు సంభవించింది. శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాద స్థలంలో భారీగా పొగ కమ్ముకుంది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
ఇది కూడా చదవండి: Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !
సోమవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషామైలారం పారిశ్రామిక వాడలో ఘోర రసాయన ప్రమాదం జరిగింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 45 మంది చనిపోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా అయిపోయాయి. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన యువకుడు
తెలంగాణలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఇంకా తేరుకోక ముందే తమిళనాడులో కూడా మరో పేలుడు సంభవించింది. శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.