TDP: జనంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. అంతర్మధనం స్టార్ట్..?

Follow

TDP: చేసింది చెప్పడం. చేయవలసింది వివరించడం. ఇదే కాన్సెప్ట్‌తో జనం బాట పడుతోంది టీడీపీ. టీడీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి కార్యాచరణ రెడీ చేసుకుటున్నారు. ఏడాది పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. జులై మొదటివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు… నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కూడా ఇంటింటికీ నేతలు వెళ్లే కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
Read Also: Donald Trump: యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. “జన్మతా పౌరసత్వం”పై అనుకూలంగా తీర్పు..
ఇదే సమయంలో ఎమ్మెల్యేలలో ఒక రకమైన అంతర్మథనం స్టార్ట్ అయ్యిందట. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలను ఎలా ఫేస్ చేయాలనే ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఏడాది గడిచినా సూపర్ సిక్స్‌కు సంబంధించి ఇంకా రెండు మూడు పథకాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం పెండింగ్‌లో ఉంది. అన్నదాత సుఖీభవ కూడా ఇంకా అమలు కాని పరిస్థితి. ఈ విషయం మీద జనం నిలదీస్తే ఎలాంటి సమాధానం చెప్పాలనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పనితీరుపై కూడా జనం అడిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందట. కొంతమంది ఎమ్మెల్యేలకు… జనాలకి లింకు కట్ అయిపోయింది. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కూడా లింక్ కట్ అయిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు ప్రిపేర్ అవుతున్నారట. జనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉన్నారట.
Read Also: TG EAPCET 2025: ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు.. విద్యార్థులకు మరింత ప్రయోజనం
ఏడాది పాలనలోనే అన్ని జరిగిపోయాయని చెప్పడం లేదని మొన్న కూటమి సమావేశంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే… చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు జనంలోకి వెళ్లి చెప్పనున్నారు ఎమ్మెల్యేలు. ఈ ఏడాది కాలంలో ఏ ఏ పథకాలు అమలు జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు. ఇలా ప్రతి అంశాన్ని జనానికి క్షుణ్ణంగా వివరించాలని, అవసరమైతే అన్ని వివరాలతో కూడా పాంప్లెంట్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు.
Read Also: Dry Fruits: ఇలాంటి వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ అస్సలు తినొద్దు..
అయితే ఎమ్మెల్యేల్లోనే అనేక డౌట్స్ ఉన్నాయి. జనం గట్టిగా నిలదీస్తే ఏ రకంగా కన్విన్స్ చేయాలి..? మిగిలిన సంక్షేమ పథకాలు ఎప్పటిలోగా అమలవుతాయని చెప్పాలి. ఈ విషయాల మీద ప్రధానంగా ఎమ్మెల్యేలు దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనానికి తాము అందుబాటులో ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. మొత్తానికి నేతలు, ఎమ్మెల్యేలను జనంలోకి పంపితే ఉన్న కొద్దో గొప్పో అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా దానికి పుల్ స్టాప్ పెట్టే పనిలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే… టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్‌లో పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.