Tech Mahindra | సప్లై చైన్, వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

Follow

Tech Mahindra | అమీర్‌పేట్, జూన్ 29 : టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు లాజిస్టిక్స్‌కు చెందిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అకాడమీ కోఆర్డినేటర్ దీప్తి తెలిపారు. ఉచిత తరగతి గది ఆధారిత శిక్షణను 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆగస్టు మొదటి వారం నుండి తరగతులు ప్రారంభమవుతాయని, మరిన్ని వివరాలకు ఎర్రగడ్డ రైతు బజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిసా చర్చ్ కాంపౌండ్ ఆవరణలోని టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని లేదా 7337332606 కు కాల్ చేయాలని కోఆర్డినేటర్ దీప్తి కోరారు.
Tech Mahindra | టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు లాజిస్టిక్స్‌కు చెందిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అకాడమీ కోఆర్డినేటర్ దీప్తి తెలిపారు.