Telangana: ఇప్పుడు ఆయన ఎవరివాడు..? కాంగ్రెస్-బీజేపీ మధ్య క్రెడిట్ వార్..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Telangana: ఇప్పుడు ఆయన ఎవరివాడు..? కాంగ్రెస్-బీజేపీ మధ్య క్రెడిట్ వార్..!

మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్..తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2021లో బీజేపీలో చేరినా యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగానే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్‌లోకి మారారు. తర్వాత వెంటనే రాజీనామా చేశారు. ఇప్పుడాయన ఎవరివాడు.. అన్నదానిపై కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది.

డీఎస్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్‌లో డీఎస్ విగ్రహావిష్కరణ జరిగింది. కేంద్రమంత్రి, బీజేపీ లీడర్ అమిత్‌ షా డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డీఎస్ తమ పార్టీకి చెందినవారేనని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. చనిపోయేముందు కాంగ్రెస్‌లో చేరినా.. వెంటనే రాజీనామా చేశారని, ఆయనకు కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టం లేకనే ఆపార్టీ నుంచి బయటకు వచ్చాశారంటోంది కమలం. డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత తమ పార్టీకే ఉందన్నది బీజేపీ వాదన.

మరోవైపు డీఎస్ విగ్రహ ఏర్పాటు స్వాగతిస్తున్నా.. బీజేపీ నేతలు ఆవిష్కరించడంపై కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డీఎస్ తమ పార్టీ నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విగ్రహానికి స్థలం కేటాయించారని, డీఎస్.. చనిపోయేవరకు కాంగ్రెస్‌వాదిగానే ఉన్నారని.. బీజేపీ సిద్దాంతాలను తీవ్రంగా వ్యతిరేకించిన నేతల్లో డీఎస్ ఒకరని.. అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీనేతలే ఆవిష్కరించడం బాధాకరమంటోంది కాంగ్రెస్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

​మాజీ ఎంంపీ, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్..తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2021లో బీజేపీలో చేరినా యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగానే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్‌లోకి మారారు. తర్వాత వెంటనే రాజీనామా చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *