Telangana: ట్రాఫిక్ చలాన్స్‌లో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన వాహనదారుడు..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Telangana: ట్రాఫిక్ చలాన్స్‌లో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన వాహనదారుడు..

ఆ బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్స్ లిస్ట్ చూసి ఖాకీలు షాక్ అయ్యారు.. కనీసం పదివేల రూపాయల విలువ చేయని ఆ బండిపై.. సుమారు అర లక్ష వరకు పెండింగ్ చలాన్స్ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు బిత్తరపోయారు.. ఆ చలాన్స్ కట్టాలని పట్టుబట్టడంతో వాహనదారుడు పోలీసుల చేతిలో తాళాలు పెట్టి వెళ్ళిపోయాడు.

మనకు తెలియకుండా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా చలాన్స్ పడుతుంటాయి. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీ చేసినప్పుడు  3, 4 ట్రాఫిక్ చలాన్స్  పెండింగ్ ఉండడం కామన్. కానీ ఏకంగా 233 చలాన్స్ పెండింగ్ ఉన్న వాహనాన్ని, అలాంటి వాహనదారుణ్ణి ఎక్కడైనా చూశారా..! వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అలాంటి ఓ వాహనదారుడు ఖాకీలకు ఊహించని షాక్ ఇచ్చాడు.. ఒకటి కాదు.. రెండు ఏకంగా 233 పెండింగ్ చలాన్స్  వాహనంపై ఉండటంతో పోలీసులు బిత్తరపోయారు.

హనుమకొండలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ వాహనం పట్టుబడింది.. ఖాజీపేట ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఓ వాహనదారుడిని ఆపి తనిఖీ చేశారు.. అతని బైక్‌పై ఉన్న 233 పెండింగ్ చలాన్స్ లిస్ట్ చూసి నిర్ఘాంతపోయారు.

వాహనదారుడు హన్మకొండకు అస్లాంగా గుర్తించారు..ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌గా ఉండగా.. వాటి మొత్తం విలువ రూ 45,350గా నిర్ధారించారు. దాదాపు ఎనిమిది ఏళ్ల నుంచి ఈ చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ చలాన్స్‌ల వివరాలు చూసిన వెంటనే వాహనదారుడికి వాటిని క్లియర్‌ చేయాలని సూచించారు. అయితే చలాన్‌ మొత్తాన్ని చూసి వాహనదారుడు బండి తాళాలు పోలీసుల చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా ఖాకీలకు ఓ వాహనదారుడు ఊహించని షాక్‌ ఇచ్చాడు. హనుమకొండలో తనిఖీ చేసిన స్కూటీపై ఏకంగా 233 పెండింగ్ చలాన్స్‌లు ఉండటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. వాహనం సీజ్ చేసి చలాన్ చెల్లించాల్సిందిగా ఆదేశించారు . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *