Telangana: తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ అని ఆ మహిళ కారు ఎక్కింది.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి.. దారుణంగా..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Telangana: తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ అని ఆ మహిళ కారు ఎక్కింది.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి.. దారుణంగా..

డాక్టర్లను ప్రాణదాతలుగా భావిస్తుంటాం. గ్రామాల్లోని ఆర్ఎంపిలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తుంటాం. కానీ ఓ కన్నింగ్ ఆర్ఎంపీ మాత్రం.. తనకు పరిచయం ఉన్న మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పురుగుల మందును ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఆమెను హత్య చేశాడు. క్రైం సినిమాను తలపించేలా అఘాయిత్యాలకు పాల్పడిన నీచుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన మహిళ తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటుంది. గ్రామంలో ఉంటున్న ఆమె అత్త ఆరు నెలల క్రితం జారిపడటంతో కాలు విరిగింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కామళ్ల గ్రామానికి చెందిన మహేశ్‌.. ఆరేళ్లుగా జూనూతలలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ మహేష్.. మహిళ అత్తకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. దీంతో ఆమెకు సపర్యలు చేసేందుకు ఆమె మిర్యాలగూడ నుంచి జూనూతలకు తరచూ వచ్చి వెళుతోంది. ఆర్ఎంపీ వైద్యుడిగా తన అత్తకు ట్రీట్మెంట్ ఇస్తున్న మహేష్ తో ఆ మహిళకు పరిచయం ఉంది.

ఈ క్రమంలోనే.. జూనూతలకు వచ్చేందుకు ఆమె మిర్యాలగూడలో బస్సెక్కి రాత్రి 9 గంటల సమయానికి కొండమల్లేపల్లికి వచ్చింది. జూనూతులకు వెళ్లేందుకు బస్ కోసం ఆర్టీసీ బస్టాండ్ లో వెయిట్ చేస్తోంది. పరిచయం ఉన్న ఆర్ఎంపి వైద్యుడు మహేష్ కారులో బస్టాండ్ కు వచ్చి ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనూతుల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. తాను ఆర్ఎంపీ డాక్టర్ మహేష్ కారులో జూనూతుల గ్రామానికి వెళుతున్నానని ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఇద్దరూ కలిసి జూనూతలకు బయల్దేరారు. కానీ.. కారును గ్రామానికి వెళ్లాల్సిన దారిలో కాకుండా ఆర్.ఎం.పి వైద్యుడు మహేష్ వేరేవైపు మళ్లించాడు. మహిళపై కన్నేసిన మహేష్.. పథకం ప్రకారం మత్తు, పురుగుల మందు కలిపిన ఇంజక్షన్లను వెంట తీసుకువచ్చాడు. మార్గమధ్యలో ఆమెకు మత్తు మందు కూల్ డ్రింక్ ఇచ్చాడు. మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళను హతమార్చే ఉద్దేశంతో రెండు చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్‌ చేశాడు. ఆమెను ఎక్కడైనా పడేసి తప్పించుకోవాలనీ మహేష్ ప్లాన్ చేశాడు.

పెట్రోలింగ్ వాహనాన్ని చూసి..

అయితే.. గుర్రంపోడులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అర్ధరాత్రి దేవరకొండ వైపు వెళ్తున్న కారును గమనించారు. గొర్రెల దొంగలుగా అనుమానించి పోలీసులు మహేష్ కారును వెంబడించారు. జూనూతుల స్టేజీ దాటి, కాచారం స్టేజీ వైపు మలుపు తిరిగిన కారును పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు. పోలీసులను చూసి మహేష్ తన కారులోని మహిళను కిందికి తోసివేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న మహిళను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను వైద్యులు హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​డాక్టర్లను ప్రాణదాతలుగా భావిస్తుంటాం. గ్రామాల్లోని ఆర్ఎంపిలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తుంటాం. కానీ ఓ కన్నింగ్ ఆర్ఎంపీ మాత్రం.. తనకు పరిచయం ఉన్న మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పురుగుల మందును ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఆమెను హత్య చేశాడు. క్రైం సినిమాను తలపించేలా అఘాయిత్యాలకు పాల్పడిన నీచుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *