Thailand: ఫోన్ కాల్ లీక్ ఎఫెక్ట్.. యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా సస్పెన్షన్
Follow

థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(37) సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంబోడియా మాజీ నేతతో దౌత్యపరమైన సంభాషణం చేయడంపై ఇరాకటంలో పడ్డారు. థాయ్‌లాండ్‌కు సంబంధించిన పాలనా అంశాలు.. పరాయి దేశ నేతతో పంచుకోవడంపై సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన మద్దతుదారు వెంటనే మద్దతు కూడా ఉపసంహరించుకుంది. తాజాగా ఆమె ప్రవర్తనపై దర్యాప్తు చేసిన తర్వాత షినవత్రాను జూలై 1 నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ప్రకటించింది. 7-2 మెజారిటీతో ఆమోదం లభించింది. షినవత్రా… మంత్రివర్గ నైతికతను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసు దాఖలైంది. విచారణ తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఇది కూడా చదవండి: Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!
కంబోడియాకు చెందిన మాజీ నేత హున్ సేన్‌కు షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఫోన్‌లో పలకరించి.. అనంతరం థాయ్‌లాండ్ రాజకీయ పరిస్థితులను వివరించారు. అటు తర్వాత థాయ్‌లాండ్ ఆర్మీ చీఫ్ పానా క్లావ్‌ప్లోడ్‌టూక్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పక్షం ధ్వజమెత్తింది. దేశ సమాచారాన్ని ఇతరులతో ఎలా పంచుకుంటారంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ పెరిగింది. దీంతో అప్రమత్తమైన ఆమె.. పొరుగు దేశానికి చెందిన మాజీ నేతతో మాట్లాడిన సంభాషణ పట్ల ఆమె క్షమాపణ చెప్పింది. అయినా కూడా నిరసనలు తగ్గలేదు. మొత్తానికి ఒక్క ఫోన్ కాల్ ఆమె ఉద్యోగం నుంచి దించేసింది.
ఇది కూడా చదవండి: Dil Raju : తమ్ముడు” నో డౌట్.. నితిన్ కు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది
షినావత్రా.. బిలియనీర్, మాజీ ప్రధాని థాక్సిన్ షినావత్రా కుమార్తె. పార్లమెంట్‌లో 495 మంది సభ్యులున్నారు. సంకీర్ణంతో షినావత్రా ప్రభుత్వం ఏర్పడింది. ఫోన్ కాల్ లీక్ అవ్వడంతో ప్రధాన మద్దతు పక్షం విత్‌డ్రా అయింది. 69 మంది ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారు.
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(37) సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంబోడియా మాజీ నేతతో దౌత్యపరమైన సంభాషణం చేయడంపై ఇరాకటంలో పడ్డారు. థాయ్‌లాండ్‌కు సంబంధించిన పాలనా అంశాలు.. పరాయి దేశ నేతతో పంచుకోవడంపై సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.