Thalapathy Vijay: ‘జన నాయగన్‌’ విజయ్‌ చివరి సినిమానా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ మమిత

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Thalapathy Vijay: ‘జన నాయగన్‌’ విజయ్‌ చివరి సినిమానా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ మమిత

దళపతి విజయ్ ఇప్పుడు ‘జన నాయగన్’ సినిమాలో నటిస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇదే విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన ఈ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో సహనటి మమితా బిజు దీని గురించి విజయ్ ను అడిగింది. జన నాయగన్’ సినిమాలో దళపతి విజయ్ సోదరి పాత్రలో మమిత నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి విరామం దొరికిన సమయంలో మమిత విజయ్ ని తన తదుపరి సినిమా ప్రాజెక్టుల గురించి అడిగింది. అయితే దీనికి విజయ్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని మమిత పేర్కొంది.
‘‘జన నాయగన్‌’ షూటింగ్‌ సమయంలో ఇదే మీ చివరి సినిమానా అని విజయ్‌ను అడిగా. ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన నాతో అన్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచింది. చిత్రీకరణ ఆఖరి రోజు నాతో పాటు అందరూ ఎమోషనల్ అయ్యారు. విజయ్‌ సార్ కూడా భావోద్వేగానికి గురయ్యారు’ అని మమితా చెప్పుకొచ్చింది.

కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. విజయ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు విజయ్. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై విజయ్ సినీ కెరీర్ ఆధారపడి ఉండనుందని తెలుస్తోంది. విజయ్ ఇంతకు ముందు నటించిన ‘గోట్’ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఆ సినిమా క్లైమాక్స్ సమయంలో ఆయన చెప్పిన డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేను చెప్పిన తర్వాతే అంతా అయిపోతుంది’ అని ఆయన అన్నారు. అంటే, తనకు ఇంకా సినిమా తీయాలనే ప్రణాళికలు ఉన్నాయని పరోక్షంగా చెప్పారు.

ఇక జననాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ జననాయగన్ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

జన నాయగన్ సినిమాలో హీరో విజయ్ దళపతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

​కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం ‘జన నాయగన్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇదే అతని చివరి సినిమా అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో జన నాయగన్ హీరోయిన్ మమిత బైజు దీని గురించి విజయ్ ని అడిగారు. అతను ఆమెకు ఇలా సమాధానమిచ్చాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *