Thammudu : ‘తమ్ముడు’ డబ్బింగ్ పూర్తి చేసిన నితిన్ .. !

Follow

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం అందిస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఇప్పటికే అభిమానుల మన్ననలు పొందుతున్నారు. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read: Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు
తాజాగా నితిన్ ఈ చిత్రంలో తన పాత్ర ‘జై’ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత నితిన్ తన పార్ట్ మొత్తాన్ని పూర్తిగా కంప్లీట్ చేసినట్లైంది. ఇది చిత్ర నిర్మాణంలో కీలకమైన మైలురాయిగా మారింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను (ప్రమోషన్స్) కూడా చిత్రబృందం వేగంగా నిర్వహిస్తోంది. ట్రైలర్, పాటల విడుదలతోపాటు పలు మీడియా ఈవెంట్లను కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ‘తమ్ముడు’ చిత్రం పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఇది నితిన్‌కు మరో హిట్ సినిమా గా నిలుస్తుంది అని నమ్ముతున్నారు.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన