Thammudu : ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈ సారైన హిట్ దక్కేనా..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Thammudu Trailer Will Nithiin Score A Much Needed Hit

టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా కనిపించనున్నాడు. ఆమె ఆపదలో ఉన్నట్లు తెలిసిన క్షణం నుంచే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ కథలోని అసలు హైపాయింట్ అని ట్రైలర్ స్పష్టమవుతోంది.

Also Read: Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !

విలన్‌గా సౌరబ్ సచ్‌దేవా అగ్రెసివ్ షేడ్స్‌తో కనిపించి సినిమాకు మరింత టెన్షన్‌ను తెస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, క్రూరత ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపేలా ఉంది. ఇక మరో కీలకంగా చెప్పుకోవాల్సింది అజనీష్ లోకనాథ్ సంగీతం. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. థియేటర్‌లో ఈ స్కోర్ ప్రేక్షకులను ఒక ఎమోషనల్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుందని అనిపిస్తోంది. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కాగా జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా, నితిన్‌కి మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందిస్తుందో లేదో చూడాల్సిందే!

 

​టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *