Thandel : బుల్లితెరపై తండేల్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే.?

Follow

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా,డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిచింది.
Also Read : Kuberaa : ధనుష్ సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకున్నావు అని నాగ్ ని అడిగా : చిరంజీవి
ఈ సినిమాతో అక్కినేని అభిమానులకు అందని ద్రాక్షలా మిగిలిన వంద కోట్ల గ్రాస్ ఆశను నెరవేర్చాడు నాగ చైతన్య. రిలీజ్ అయిన మొదటి వారానికి ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది. అటు థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన తండేల్ ఓటీటీలోను సూపర్ హిట్ గా నిలిచింది. మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన తండేల్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే సినిమా రిలీజ్ అయి మూడు నెలలు అవుతున్న కూడా తండేల్ బుల్లెతెరపై రిలీజ్ కాలేదు. తండేల్ శాటిలైట్ రైట్స్ ను జీ ఛానెల్ కొనుగోలు చేసింది. కానీ బుల్లితెరపై ప్రసారం చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. కాగా ఇప్పుడు తండేల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 29న అనగా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు తండేల్ టెలివిజన్ ప్రీమియర్ ను ప్రసారం చేయనుంది. థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన తండేల్ బుల్లితెరపై ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా,డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు